రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం బాహుబలి 2 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ 2017 వ సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి భారీ కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 66.90 కోట్ల కనెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 34.38 కోట్లు , ఉత్తరాంధ్రలో 26.47 కోట్లు , ఈస్ట్ లో 17.04 కోట్లు , వెస్ట్ లో 12.31 కోట్లు , గుంటూరు లో 18.01 కోట్లు , కృష్ణ లో 14.10 కోట్లు , నెల్లూరులో 8.04 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 197.65 కోట్ల కనెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి కర్ణాటక ఏరియాలో 62 కోట్ల కలెక్షన్లు దక్కగా , తమిళనాడు ఏరియాలో 81 కోట్ల కలెక్షన్లు దక్కాయి. కేరళలో 32.12 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 281.05 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఓవర్సీస్ లో ఈ మూవీ కి 160.28 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 814.10 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 814.10 కోట్ల షేర్.. 1750 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ ద్వారా బయ్యర్లకు 464.10 కోట్ల లాభాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: