- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ హిట్ - 3 ’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సీరిస్ లో భాగంగా వ‌చ్చిన హిట్ , హిట్ 2 సినిమా లు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు హిట్ 3 సినిమా మీద టాలీవుడ్ లోనూ .. ఇటు ట్రేడ్ వ‌ర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. హిట్ 3 సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందించారు. శైలేష్ కొల‌ను గ‌త యేడాది సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ హీరో గా తెర‌కెక్కించిన సైంధ‌వ్ సినిమా పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. అయినా కూడా హిట్ 3 మీద భారీ అంచ‌నాలు ఉన్నాయంటే అందుకు ప్ర‌ధాన కార‌ణం నాని యే అని చెప్పాలి . నానిసినిమా మేకింగ్ ద‌గ్గ‌ర నుంచి ప్ర‌మోష‌న్ల వ‌ర‌కు అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు.


ఇక ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు .. ట్రైల‌ర్లు సినిమాపై అంచ‌నాలు అమాంతం పెంచేశాయి. హిట్ 3 క ఈ సినిమాలో నాని చేయబోయే రక్తపాతం ప్రేక్షకులను స్టన్ చేస్తుందని మేకర్స్ ధీమా తో ఉన్నారు. ఇక నాని అయితే నార్త్ ఇండియా లో ప్ర‌మోష‌న్లు జోరుగా చేస్తున్నాడు. ఇప్పటికే సెన్సార్ పనులు కూడా ముగించుకున్న హిట్ 3 సినిమాకు క్లైమాక్స్ లో ఇప్పుడు తుది మెరుగులు దిద్దే ప‌నిలో మేక‌ర్స్ బిజీ గా ఉన్నారు. ఇక  ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 30 నిమిషాలుగా ఉంది. అయితే ఈ ర‌న్ టైం ను ఇప్పుడు 5 - 8 నిమిషాలు త‌గ్గించే ప‌నిలో ఉన్నార‌ట‌. ఫైనల్ ర‌న్ టైం లాక్ అయ్యాక అస‌లు కాపీల‌ను థియేట‌ర్ల‌కు పంపుతార‌ట‌. ఏదేమైనా హిట్ 3 రిలీజ్ కు ముందు కొద్ది గంట‌ల వ్య‌వ‌ధి లో ఇలా ట్రిమ్ చేస్తున్నార‌న్న వార్త‌లు ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: