అలనాటి హీరోయిన్ మాళవిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకానొక సమయంలో తెలుగులో వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉండేది. తన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది నటి మాళవిక. "చాలా బాగుంది" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు ఎంతగానో చేరువైంది. తెలుగులో అనేక సినిమాలలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ ఇలా అనేక భాషా చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. 


మాళవిక హీరో రజనీకాంత్, నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన చంద్రముఖి సినిమాలో చివరిసారిగా నటించింది. ఆ తర్వాత తెలుగులో ఎలాంటి సినిమాలలోనూ నటించలేదు. ఇక చాలాకాలం తర్వాత బుల్లితెరపై తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. మాళవిక మరోసారి సినిమాలలో అవకాశాలను అందుకోనుంది. మాళవిక సినిమాలకు దూరమైనప్పటికి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు, తన కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటుంది.


ఇక సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మాళవిక తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి సంచలనంగా మారుతున్నాయి. అందులో మాళవిక బికినీ వేసుకొని ఫోటోలు దిగింది. షిప్ పై కూర్చుని వెనుక నుంచి తన అందాలను చూపిస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అంతేకాకుండా బికినీలో మాళవిక చాలా హాట్ గా కనిపిస్తూ తన అందాలను ఆరబోసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.


ఇంత వయసులో ఉండి ఇలా ఎక్స్పోజింగ్ చేయడం అవసరమా అని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఇక మాళవిక వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం తరగని అందం, ఫిట్నెస్ తో చాలా హాట్ గా కనిపించి తన అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక మాళవిక వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటుందని సినీ వర్గాల్లో సమాచారం అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: