టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ చిన్నది అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న సమంతతో సినిమాలు చేయడానికి దర్శకులు, నిర్మాతలు, హీరోలు సైతం ఆసక్తిని చూపించారు. ఇక సమంత ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటివరకు సమంత తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. 

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే అగ్ర హీరోయిన్ల జాబితాలో సమంత ముందు వరుసలో ఉన్నారు. ఇక తెలుగులో మాత్రమే కాకుండా సమంత హిందీ భాషా చిత్రాలలోనూ నటిస్తూ మంచి గుర్తింపు పొందుతోంది. సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా సమంత సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో కాసేపు ముచ్చటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సమంత తన అభిమానులకు "ఆస్క్ మీ ఎనీథింగ్'' అని పోస్ట్ షేర్ చేసుకోగా.... చాలామంది అభిమానులు సమంతను ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు సమంత చాలా ఓపికగా సమాధానం ఇచ్చింది.

ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ప్రేమికులు టాటూలు వేయించుకోవడం పైన మీ అభిప్రాయం ఏంటి సమంత అని అడగగా... దానికి సమంత స్పందిస్తూ నా అభిమానులకు నేను ఒకటే చెప్పాలని అనుకుంటున్నాను. ప్రేమించుకుంటే ప్రేమించుకోండి తప్పులేదు కానీ టాటూలు మాత్రం వేయించుకోవద్దు. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ సమంత సమాధానమిచ్చారు.. గతంలో నాగచైతన్య, సమంత ప్రేమించుకున్న సమయంలో వారిద్దరూ ఒకరి పేరును మరొకరు టాటూలు వేసుకున్నారు. ఇక విడాకులు అనంతరం కూడా వారు టాటూలను చెరిపి వేయకుండా అలానే గుర్తుగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలోనే సమంత టాటూల గురించి ఈ విధంగా చెప్పడంతో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: