టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ తన తదుపరి మూవీ ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అట్లీతో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. బన్నీ , అట్లీ కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ ఈ మూవీ బృందం వారు ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక ఆ వీడియో ప్రకారం ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతున్నట్లు అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ,అట్లీ కాంబోలో రూపొందబోయే సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు కనిపించే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం అట్లీ , అల్లు అర్జున్ కి జోడిగా ముగ్గురు హీరోయిన్లను వెతికే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది ..? ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం ఎక్కడ జరగబోతుంది ..? అనే విషయానికి సంబంధించి ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూలై నెల నుండి మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై నెలలో ఖచ్చితంగా ఒక షెడ్యూల్ ను మొదలు పెట్టాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క మొదటి షెడ్యూల్ ను ముంబై లో మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ హీరోగా నటించనున్న మూవీ కావడం ,  అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా కావడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa