టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో శ్రీ విష్ణు ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఈ మధ్య కాలంలో మాత్రం శ్రీ విష్ణు వరుస పెట్టి సినిమాల్లో హీరో పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు. ఈయన హీరోగా నటించిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. కొంత కాలం క్రితం శ్రీ విష్ణు , హసిత్ గోలీ దర్శకత్వంలో రూపొందిన స్వాగ్ అనే మూవీ లో హీరో గా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

తాజాగా శ్రీ విష్ణు "సింగల్" అనే సినిమాలో హీరో గా నటించాడు. కార్తీక్ రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణులు అయినటువంటి కేతికా శర్మ , ఇవానమూవీ లో శ్రీ విష్ణు కు జోడిగా నటించారు. ఈ మూవీ నిన్న అనగా మే 9 వ తేదీన భారీ ఎత్తున థియేటర్లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు , ఈ మూవీ కి సంబంధించిన కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sv