సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఇళయరాజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన ఇళయరాజా ఇప్పటికీ అడపాదడపా ఆఫర్లను సొంతం చేసుకుంటూ సత్తా చాటుతున్నారు. తన ఒక్కరోజు రెమ్యునరేషన్ ను ఇళయరాజా భారత రక్షణ శాఖకు విరాళం ఇచ్చి ప్రశంసలు అందుకున్నారు.
 
ఈ మొత్తం ఒకింత తక్కువ మొత్తమే అయినా దేశంపై ఇళయరాజా మమకారాన్ని చాటుకున్నారు. ఇళయరాజా తన పోస్ట్ లో మన దేశ పర్యాటకులపై ఉగ్రమూక దాడి చేసిందని మన దేశ సైనికులు దీనికి తప్పక ప్రతీకారం తీర్చోవాలని ఆయన కామెంట్లు చేశారు. వారి ధైర్య సాహసాలు అభినందనీయం అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి నెలకొన్న సంగతి తెలిసిందే.
 
నిన్న రాత్రి పాకిస్తాన్ ఎలాంటి ఉద్రిక్త చర్యలకు పాల్పడకపోవడంతో భారత్ సైతం ఇప్పటికే కూల్ అయింది. భవిష్యత్తులో కూడా ఇదే తరహా పరిస్థితులు నెలకొనాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం వస్తే భారత్ సైతం ఆర్థికంగా తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. మరోవైపు భారత రక్షణ శాఖకు టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం విరాళం ఇస్తారా అనే చర్చ జరుగుతోంది.
 
రాబోయే రోజుల్లో పాక్ మళ్లీ రెచ్చగొడితే మాత్రం భారతదేశం మాత్రం యుద్దానికి సై అనే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు పహల్గామ్ దుర్ఘటనపై ఇప్పటికే సెలబ్రిటీలు సైతం స్పందించారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. టాలీవుడ్ సెలబ్రిటీలు భారతదేశం సైనికులకు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇళయరాజా వివాదాలకు దూరంగా ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇళయరాజా కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. ఈయన రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఉంది.






మరింత సమాచారం తెలుసుకోండి: