
అందుకే అన్ని తట్టుకొని తనకంటూ సపరేట్ పొజిషన్ వచ్చేవరకు కష్టపడింది . రీసెంట్గా శుభం సినిమాతో హిట్ కొట్టింది . ప్రొడ్యూసర్ గా ఒక ఉమెన్ సక్సెస్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు . దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది . ఆ కష్టాన్ని పూర్తిగా భరించింది . సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సమంత రెండో సినిమాను కూడా ప్రొడ్యూస్ చేయబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు సమంత పర్సనల్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డైరెక్టర్ రాజ్ నిడమోరు తో సమంత రెండో పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దానికి తగ్గట్టే వీళ్ళిద్దరూ క్లోజ్ గా దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి . స్వయాన సమంతనే రాజ్ నిడమోరు భుజంపై వాలి ఉన్న ఫోటో షేర్ చేయడంతో వీళ్ళ బంధం ఆల్మోస్ట్ అఫీషియల్ గా బయటపడిపోయింది . అయితే ఇదే మూమెంట్లో గతంలో సమంత బాయ్ ఫ్రెండ్ గా ఉన్న స్టార్ హీరోకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . హీరో సిద్ధార్ధ్.. సమంతల ప్రేమాయణం అందరికీ తెలిసిందే . గుడిలో కూడా పక్కపక్కనే కూర్చుని పూజలు చేయించుకున్నారు. అయితే నాగచైతన్య కన్నా ముందే సమంత భర్త హోదా సిద్ధార్ధ్ దక్కించుకోవాల్సిందే . కానీ వాళ్ల మధ్య వచ్చిన మిస్ అండర్స్టాండిన్స్ కారణంగా విడిపోయారు . ఆ తర్వాత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఆ తర్వాత జరిగిన తతంగాలు అంతా అందరికీ తెలిసిందే . ఇప్పుడు సమంత భర్తగా రాజ్ నిడమోరు అయినా సెటిల్ అవుతాడో లేదో అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ ..? కాలమే దానికి సమాధానం చెప్పాలి..!