తెలుగు సినీ ఇండస్ట్రీనీ సైతం ప్రోత్సహించేందుకు రెండు తెలుగు రాష్ట్రా ప్రభుత్వాలు సైతం ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకొని మరి ముందుకు వెళుతున్నాయి. మొన్నటి రోజున తెలంగాణ ప్రభుత్వం కూడా గద్దర్ అవార్డులను ఇస్తామంటూ ప్రకటించారు. ఆ సమయంలో పలువురు సినీ సెలబ్రిటీలతో కూడా తెలంగాణ ప్రభుత్వం భేటీ అయి మరి అన్ని సిద్ధం చేసింది.ఇప్పుడు తాజాగా ఏపీలో సినిమాటోగ్రఫీ గా ఉన్న మంత్రి కందుల దుర్గేష్ కూడా ఇటీవలే ఒక ప్రకటన చేయడం జరిగింది. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన భైరవం సినిమా మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ముగ్గురు మల్టీ స్టార్లర్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది.


తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి మంత్రి కందుల దుర్గేష్ అతిథిగా వచ్చారు.. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో సినిమా పరిశ్రమను మరింత ప్రోత్సహించేందుకు అన్ని రకాల చర్యలు జరుగుతున్నాయి అంటూ తెలియజేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో షూటింగులు ఇంకా బాగా జరగాలని అందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకుంటున్నామంటు తెలియజేశారు మంత్రి కందుల దుర్గేష్. ఫిలిం పాలసీ కూడా తీసుకువస్తామని త్వరలోనే ఇక్కడ సినిమాలను తెరకెక్కించే విధంగా అన్ని సదుపాయాలను కూడా తీసుకువస్తున్నామంటూ తెలిపారు.


ఏపీలో ఎప్పటినుంచో మూలన పడిపోయిన నంది అవార్డులను సైతం త్వరలోనే ప్రకటించబోతున్నాము అంటూ తెలియజేయడం జరిగింది. మరి కొద్ది రోజులలో అటు సినిమా నిర్మాతలతో పాటుగా డైరెక్టర్లతో కూడా భేటీ అయి మరి వారి యొక్క సూచనలు మేరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలియజేశారు మంత్రి కందుల దుర్గేష్. ఏపీలో సినీ పరిశ్రమలు కూడా మరింత విస్తరింప చేయడమే తమ బాధ్యత అన్నట్లుగా తెలియజేశారు మంత్రి కందుల దుర్గేష్. మరి ఏ మేరకు ఏపీలో సినీ పరిశ్రమకు సంబంధించి డెవలప్మెంట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: