జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం వార్ 2. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నారు. నిన్నటి రోజున ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ని కూడా విడుదల చేయగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిం బ్యానర్ వారు ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే మొదటిసారి ఎన్టీఆర్ బాలీవుడ్లో నటిస్తూ ఉండడంతో ఫ్యాన్స్ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ కొన్ని విషయాలను వైరల్ గా చేస్తున్నారు.


ముఖ్యంగా ఎన్టీఆర్ బాలీవుడ్లో నెగిటివ్ రోల్ లో నటించడానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయంపై అభిమానులు తెగ వెతికేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 60 కోట్ల రూపాయల వరకు తీసుకున్నారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఒక సౌత్ హీరోకి బాలీవుడ్ లో ఈ రేంజిలో రెమ్యూనరేషన్ ఇవ్వడం అంటే అది ఆశమాషి విషయం కాదంటూ పలువురు క్రిటిక్స్ తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ కి ఇతర ప్రాంతాలలో కూడా భారీ క్రేజీ ఉందని ఈ క్రేజ్ ను ఉపయోగించుకునేందుకు చిత్ర బృందం అన్ని కోట్ల రూపాయలు ఇచ్చిందంటూ అభిమానులు తెలుపుతున్నారు.


వార్ 2 సినిమా షూటింగ్ గత రెండేళ్లుగా జరుగుతూ ఉన్నది. కానీ ఈ సినిమా మొత్తం చిత్రీకరణ పూర్తి కావడానికి ఇంకా 150 రోజులు మాత్రమే మిగిలి ఉన్నదట. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటలీ, జపాన్, రష్యా, స్పెయిన్, అబుదాబి వంటి ప్రాంతాలలో చిత్రీకరించాలని తెలుస్తోంది. టీజర్లో యాక్షన్స్ సన్నివేశాలతో పాటు కియార అద్వానీ ధరించిన బికినీ షూట్ మాత్రం హైలైట్ గా నిలిచింది. వార్ చిత్రంలో హృతిక్ రోషన్, టైగర్ స్రాఫ్ నటించారు. ఈ సినిమా విడుదలై ఆరు సంవత్సరాలు అవుతోంది. వార్ 2 సినిమా ఈ ఏడాది ఆగస్టు 14న రిలీజ్ చేయబోతున్నారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి డైరెక్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి: