బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ,నారా రోహిత్, మంచు మనోజ్ హీరోలుగా నటించిన చిత్రం భైరవం. ఈ సినిమా ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది డైరెక్టర్ విజయ్ కనకమెడల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై హీరోయిన్స్ గా నటించారు. తమిళంలో బ్లాక్ బస్టర్ గా పేరుపొందిన గరుడన్ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లు కూడా చాలా వైలెన్స్ తో చూపించడం జరిగింది. ఈ ముగ్గురు హీరోలకు కూడా సరైన సక్సెస్ లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ సినిమాతోనే ఈ ముగ్గురు హీరోల కెరియర్ పాజిటివ్గా మారుతుందని చాలా ధీమాతో ఉన్నారు.


కానీ ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు పెద్ద ధూమారం ఇండస్ట్రీలో కనిపిస్తోంది. బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో భైరవం సినిమా గురించి ఒక ట్రెండ్ మొదలయ్యింది.. ముఖ్యంగా డైరెక్టర్ సినిమా ఈవెంట్లో మాట్లాడిన మాటలకు చాలామంది రాజకీయ కార్యకర్తలు నేతలు కూడా హర్ట్ అవడంతో ఈ సినిమాని బాయికాట్ చేయాలని మొదలుపెట్టారు. ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు మెగా అభిమానులు కూడా బాయ్ కాట్ ట్రెండును మరొకసారి వైరల్ గా చేస్తున్నారు.


2011లో డైరెక్టర్ విజయ్ కనకమెడల చిరంజీవి ,రామ్ చరణ్ లకు సంబంధించి ఒక మార్పింగ్ ఫోటో చేసి పోస్ట్ చేశారనే విధంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. దీంతో డైరెక్టర్ పైన మెగా అభిమానులు కూడా రోలింగ్ చేయడమే కాకుండా భైరవం సినిమా బాయ్ కాట్ అంటూ వైరల్ చేస్తున్నారు. ఈ విషయం పైన తాజాగా డైరెక్టర్ విజయ్ కనకమెడల మాట్లాడుతూ తాను మెగా హీరోలతో పని చేశానని వారి యొక్క సపోర్టు కూడా నాకు ఉన్నది అలాంటి కుటుంబం పై తాను ఇలాంటి పని చేయను.. ఎక్కడో హ్యాక్ అయ్యి  ఉండవచ్చు అంటూ తెలుపుతూ.. అయినా కూడా నా పేజీలో ఇది పోస్ట్ అయ్యింది కనుక నాదే బాధ్యత అందరూ నన్ను క్షమించాలి అంటూ తెలియజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది డైరెక్టర్ విజయ్ కనకమెడల.

మరింత సమాచారం తెలుసుకోండి: