
ప్రస్తుత నిర్మాణ రంగంలోకి కూడా సమంత అడుగుపెట్టి తన మొదటి సినిమా శుభంతో మంచి విజయాన్ని అందుకుంది. అయితే సమంత తన బ్యానర్లో మొదట అనౌన్స్మెంట్ చేసిన మా ఇంటి బంగారం సినిమా సమంత మెయిన్ పాత్రలో నటిస్తూ ఉన్నది.. ముఖ్యంగా ఒక తుపాకీ పట్టుకొని సమంత పోస్టర్ని కూడా తెలియజేస్తూ అనౌన్స్మెంట్ చేశారు. కానీ కొన్ని కారణాల చేత ఆ సినిమా ఆగిపోవడంతో శుభం సినిమాని తెరపైకి తీసుకువచ్చింది సమంత. ఈ సినిమాతో గట్టిగానే ప్రమోషన్స్ చేసి మరి నిర్మాతగా సక్సెస్ అందుకుంది సమంత.
అలా ఈ ఏడాది తన బ్యానర్ మీద తనికెక్కించిన సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అయితే మరొక ప్రాజెక్ట్ మా ఇంటి బంగారం సినిమా షూటింగు కూడా పూర్తి కావస్తోంది అన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సమంత కూడా మా ఇంటి బంగారం సినిమా పై అప్డేట్ త్వరలోనే ఇస్తానంటూ తెలియజేసింది. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేసే విధంగా సమంత ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే డిసెంబర్లోనే ప్లాన్ చేస్తా ఉందట. సమంత నిర్మాతగా ఒకే ఏడాదిలో రెండు సినిమాలను విడుదల చేయడం అంటే చాలా గొప్ప విషయమని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ ఏడాది తన సినిమాను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇస్తుందేమో చూడాలి మరి.