టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా సురేష్ బాబుకు పేరు ఉండగా ప్రస్తుతం సురేష్ బాబు పరిమితంగా సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సురేష్ బాబుకు చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లు ఉన్నాయి. తాజాగా జరిగిన థియేటర్ల బంద్ వ్యవహారంలో సురేష్ బాబు పేరు ఎక్కువగా చర్చల్లోకి వచ్చింది. ఆయన తీరు విషయంలో సైతం కొన్ని కథనాలు వచ్చాయి.
 
థియేటర్ల బంద్ వ్యవహారం గురించి ఇప్పటికే దిల్ రాజు, అల్లు అరవింద్ స్పందించినా సురేష్ బాబు మాత్రం ఈ వివాదం గురించి స్పందించలేదు. ఆ నలుగురిలో సురేష్ బాబు కూడా ఒకరని భావించే వాళ్లు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో సురేష్ బాబుకు కొన్ని థియేటర్లు ఉండగా ఏఎం రత్నం గత సినిమాలకు సంబంధించి సురేష్ బాబుకు కొంత మొత్తం ఇవ్వాల్సి ఉంది.
 
తూర్పు గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ లో ఇప్పటికే ఇందుకు సంబంధించి సురేష్ బాబు ఫిర్యాదు చేశారని సమాచారం. అయితే హరిహర వీరమల్లు సినిమా చుట్టూ రాజకీయం జరుగుతున్న నేపథ్యంలో సురేష్ బాబు తన బాకీ వసూలు దిశగా అడుగులు వేస్తారా అనే చర్చ జరుగుతుండటం గమనార్హం. ఇప్పుడు బాకీ వసూలు చేసుకోకపోతే సురేష్ బాబుకు సైతం ఆర్థికంగా నష్టం వాటిల్లే ఛాన్స్ అయితే ఉంది.
 
సురేష్ బాబు ఈ వ్యవహారం విషయంలో ఏ విధంగా ముందుకెళ్తారనే చర్చ సైతం జరుగుతోంది. సురేష్ బాబు తన డబ్బుల విషయంలో ఒకింత పట్టుదలతోనే వ్యవహరిస్తారనే టాక్ అయితే ఉంది. అందువల్ల సురేష్ బాబు ఏం చేస్తారనే చర్చ జరుగుతోంది. హరిహర వీరమల్లు సక్సెస్ సాధించడం నిర్మాత ఏఎం రత్నంకు సైతం ఎంతో కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏఎం రత్నం హరిహర వీరమల్లు సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.




మరింత సమాచారం తెలుసుకోండి: