టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ చిత్రం `పోకిరి`. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా యాక్ట్ చేయగా.. ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, నాస‌ర్‌, సాయాజీ షిండే తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. 2006లో విడుదలైన పోకిరి చిత్రం సంచలన విజ‌యాన్ని నమోదు చేసింది.


200 కేంద్రాల్లో 100 రోజులు, 63 కేంద్రాల్లో 175 రోజులు, 15 కేంద్రాల్లో 200 రోజులు ఆడి బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. అప్పటికే వ‌రుస ఫ్లాపుల‌తో సతమతమవుతున్న మహేష్ పోకిరి చిత్రంతో కలలో కూడా ఊహించని బిగ్ హిట్ ను అందుకున్నాడు. భారీ స్టార్డ‌మ్‌ ను సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో మహేష్ క్యారెక్టరైజేషన్, మేనరిజమ్స్ అటు అభిమానుల‌ను ఇటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.


అలాగే హీరోయిన్ గా ఇలియానా యాక్ట్ చేసింది. శృతి అనే మ‌ధ్య‌త‌ర‌గ‌తి అమ్మాయి పాత్ర‌లో అద‌ర‌గొట్టింది. త‌న జీరో సైజ్ అందాల‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొట్టింది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. పోకిరి చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఇలియానా కాదు. మొదట డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ ఓ బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకోవాలని భావించారట. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు కంగనా రనౌత్.


అయితే పోకిరిలో ఛాన్స్ వచ్చినప్పుడు కంగనా బాలీవుడ్ లో `గ్యాంగ్ స్టార్` అనే మూవీ చేస్తుంది. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో కంగనా సున్నితంగా పోకిరి సినిమాను తిరస్కరించింది. దాంతో కంగ‌నాకు బదులుగా అప్పుడే `దేవదాసు` మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ బ్యూటీ ఇలియానాను తీసుకున్నారు. కట్ చేస్తే పోకిరి చిత్రం బ్లాక్ బ‌స్టర్ గా నిలిచింది. మ‌హేష్ బాబుతో పాటు ఇలియానా కూడా స్టార్ హోదాను అందుకుంది. ఆ త‌ర్వాత టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారింది. ఇక పోకిరి మూవీని వదులుకున్నందుకు చాలా బాధపడినట్టు గతంలో ఓ ఇంటర్వ్యూలో కంగ‌నా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: