మాజీ యూనివర్స్ , బాలీవుడ్ లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన లారా దత్త గురించి చెప్పాల్సిన పనిలేదు.. 2003లో అందాజ్ అనే చిత్రంలో నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. తెలుగులో రాజశేఖర్ నటించిన సత్యమేవ జయతే అనే చిత్రంలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. అయితే తాజాగా లారా దత్త ఇంట తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నట్లు తెలుస్తోంది.


ఈమె తండ్రి రిటైర్డ్ వింగ్ కమాండర్ ఎల్కే దత్తా ఈ రోజున మరణించినట్లు తెలుస్తోంది. ఈ రోజున ముంబైలో అంత్యక్రియలను కూడా పూర్తి చేశారట. లారా దత్త భర్త మహేష్ భూపతి తో కలిసి అంత్యక్రియలలో హాజరయ్యింది. అయితే తన తండ్రి మృతికి గల కారణాలు ఏంటో తెలుపలేదు లారా దత్త.. ఇటీవలే 84వ సంవత్సరంలోకి అడుగుపెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం విన్న అభిమానులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. లారా దత్త 2011లో పేద పిల్లల కోసం కిక్ ఫర్ చేంజ్ అనే వాటికి ప్రచారకర్తగా ఉన్నది. అంతేకాకుండా యాసిడ్ బాధితుల కోసం ప్రత్యేకించి మరి నిధులు సేకరించింది.


2019లో సొంతంగా ఈమె కాస్మోటిక్ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది. ముఖ్యంగా అన్యాయం జరిగిన మహిళల కోసం ఎప్పుడూ అండగా నిలబడుతూ ఉంటుంది. మహిళల కోసం అభివృద్ధి చేయడానికి అప్పుడప్పుడు పలు రకాల స్పీచ్లతో మోటివేషన్ చేస్తూ ఉంటుంది లారా దత్త. గతంలో బేస్ బాల్ ఆటగాడు అయినా డెరెక్ జెటర్ తో కొంతకాలం డేటింగ్ కూడా చేసింది. ఆ తర్వాత కొన్ని కారణాలు చేత విడిపోవడంతో భారత్ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతి తో ఎంగేజ్మెంట్ చేసుకొని 2011న వివాహం చేసుకుంది. 2012లో వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: