స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ ని సంపాదించుకున్నారు.. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప 1, పుష్ప 2 సినిమాలతో దేశవ్యాప్తంగా ఒక చరిత్రను సృష్టించారు అల్లు అర్జున్. బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ అంటే పుష్ప అనేలా చేశారు. యాక్టింగ్ పరంగా కూడా నేషనల్ అవార్డుని అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ అట్లీతో ఒక భారీ మూవీని చేస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం డైరెక్టర్ రాజమౌళితో సినిమా ఎప్పుడు ఉంటుందా అంటూ చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు.


రాజమౌళి ,అల్లు అర్జున్  కాంబినేషన్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అయితే సినిమా సాధ్యం కాదని తెలుస్తోంది.. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీతో ప్రాజెక్టు మొదలుపెడితే రెండేళ్ల సమయం పడుతుందని ఆ వెంటనే డైరెక్టర్ త్రివిక్రమ్ తో కూడా ఒక మైథాలజికల్ కాన్సెప్ట్  సినిమా రాబోతున్నది.. ఆ తర్వాత  పుష్ప 3 సినిమా తెరకెక్కించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా డైరెక్టర్ కొరటాల శివ తో కూడా ఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఇలా ఈ ప్రాజెక్టులన్ని కూడా అయిపోయే వరకు రాజమౌళితో  సినిమా చేసే అవకాశం కనిపించడం లేదు.  రాజమౌళి సినిమా అంటే కనీసం రెండు మూడేళ్లయిన సమయం పడుతుంది.. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో SSMB 29 చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలు అంటే సుమారుగా నాలుగేళ్ల సమయం పడుతుంది.ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఒక ప్రాజెక్టు ప్రభాస్ తో మరొక ప్రాజెక్టు చేయబోతున్నారట. అలా మొత్తం మీద రాజమౌళి ఫ్రీ అవ్వాలి అంటే సుమారుగా 8 ఏళ్లు పైనే పడుతుంది. దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ రాజమౌళి కాంబినేషన్లో సినిమా రావాలి అంటే సుమారుగా 10 సంవత్సరాలు పడుతుందని తెలుస్తోంది..అయితే అభిమానులు మాత్రం ఎంత సమయమైనా సరే రాజమౌళి ,బన్నీ కాంబినేషన్లో సినిమా పడితే రికార్డులు తిరగ రాయడం ఖాయమని ధీమాని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై రాజమౌళి ఏమంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: