బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో లోకేష్ కనకరాజు ఒకరు. ఇది ఇలా ఉంటే అమీర్ ఖాన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో మూవీ రూపొందబోయే అవకాశం ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ క్రేజీ కాంబోలో మూవీ సెట్ అయినట్లు తెలుస్తోంది.

తాజాగా లోకేష్ కనకరాజు , ఆమీర్ ఖాన్ కి ఒక అతను వినిపించగా , అది అద్భుతంగా నచ్చడంతో వెంటనే ఆమెన్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆమీర్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఆమీర్ ఖాన్ , లోకేష్ కనకరాజు కాంబో మూవీ ఓ అదిరిపోయే జోనర్ మూవీగా రూపొందబోతునట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఆమీర్ ఖాన్ , లోకేష్ కనకరాజు కాంబోలో సినిమా సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందబోపోతున్నట్లు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకేక్కించడానికి లోకేష్ కనకరాజ్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజంగానే ఆమీర్ ఖాన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సూపర్ హీరో కాన్సెప్ట్ తో మూవీ రూపొందినట్లయితే ఆ మూవీపై భారీ అంచనాలు నెలకొనడం ఖాయం , ఒక వేళ ఆ సినిమాకు మంచి టాక్ వస్తే ఆ మూవీ కి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు కూడా వస్తాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: