మంచు విష్ణు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి హిట్లు లేకుండా ఇబ్బందులు పడుతున్న హీరో.. అలాంటి ఈయన ఒక భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇదే తరుణంలో కన్నప్ప సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాపైన ఆయన పూర్తి ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదే తరుణంలో మంచు విష్ణు వరుస ప్రమోషన్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాడు. అయితే తాజాగా ఆయన ఒక నిర్మాణ సంస్థకు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. చివరికి ఆ సంస్థ సీఈవో వాళ్లు వచ్చి సారీ చెప్పి వెళ్లిపోయారు. మరి అది వివరాలు ఏంటో చూద్దాం.. తాజాగా మంచు విష్ణు సినిమాకు సంబంధించినటువంటి బిజినెస్ గురించి బయటపెట్టాడు..కన్నప్ప సినిమా కోసం 200 కోట్లు బడ్జెట్ అయిందని అన్నాడు. 

ఇది నా సొంత డబ్బు, నా సొంత బ్యాంకు లోన్స్ తోనే చేశానని యూనివర్సిటీ డబ్బులు ఏ మాత్రం వాడుకోలేదని చెప్పుకొచ్చాడు. అదొక ట్రస్ట్ కింద ఉంది దాన్ని వాడితే నన్ను జైల్లో వేస్తారని అన్నారు. అంతేకాకుండా బొంబాయి కంపెనీ వాళ్ళు పిలిస్తే అక్కడికి మాట్లాడానికి వెళ్లాను.. నార్త్ లో థియేటర్ రిలీజ్ కోసం వాళ్లు మేము అడ్వాన్స్ లు ఇవ్వమని చెప్పారు.. నేను నిన్ను మీ కంపెనీని నమ్ముకుని సినిమా తీయలేదని, నా ఆస్తులు నా క్రెడిబిలిటీ  తాకట్టుపెట్టి సినిమా తీస్తున్నానని చెప్పుకొచ్చాను.. మీ కంపెనీ వచ్చి నన్ను కాపాడాలని సినిమా తీయలేదని మంచు విష్ణు గట్టిగా అన్నారు. ఒకవేళ మీ డబ్బు కోసం నేను వచ్చాను అనుకుంటే మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పాను. నా మాటలు విన్న సీఈఓ వాళ్ళంతా వచ్చి  సారీ సార్ అని చెప్పారు. కానీ ఆ తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేసాను..

ఇక ఇదే కాకుండా ఓటీటీలోకి వెళ్తే ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎనిమిది నెలలకు ఓటీటీ వాళ్లకు వస్తుంది.. అలాగే ఓటిటీ వాళ్లతో సినిమా హిట్ అయితే ఎంత ఇస్తారని అడిగాను. వాళ్లు ఒక అమౌంట్ చెప్పారు చెక్ రెడీ చేసుకోమని చెప్పాను. ఇదే కాకుండా శాటిలైట్ ఛానల్స్ వాళ్ళతో కూడా చర్చలు జరుపుతున్నానని అన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మంచు విష్ణు ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమైపోయారు. ఈ విధంగా కన్నప్ప సినిమా కోసం మంచు విష్ణు శతవిధాలా కష్టపడుతున్నారు. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తే మాత్రం సినిమా బిజినెస్ బాగానే అయ్యేటట్టు కనిపిస్తోంది. మరి చూడాలి ఈ సినిమాతో అయినా మంచు విష్ణు గాడిన పడతారా లేదంటే బోల్తా పడి  మునుపటిలాగే మిగిలిపోతారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: