ప్రస్తుతం మలయాళం, తెలుగు, తమిళ్ చిత్రాలతో బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇకపోతే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న దుల్కర్.. రీసెంట్ టైమ్‌లో ఏకంగా రెండు భారీ డిజాస్టర్స్ నుంచి తప్పించుకున్నాడు. అందులో ఒకటి `ఇండియన్ 2`. కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ ఇది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ గా దుల్కర్‌ను తీసుకున్నారు. కానీ ఆ తర్వాత అనివార్య కారణాలతో దుల్కర్ ఇండియన్ 2 నుంచి తప్పుకోవడం.. ఆయన ప్లేస్ ను సిద్ధార్థ్ రీప్లేస్ చేయడం జరిగింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ఎలాంటి పరాజయాన్ని మూటగట్టుకుందో తెలిసిందే.
ఇక ఈవారం విడుదలైన `థగ్ లైఫ్` మూవీని కూడా దుల్కర్ మిస్ చేశాడు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రంలోనూ కమల్ హాసన్‌నే మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. అయితే మరొక ముఖ్యమైన పాత్రను శింబు పోషించాడు. శింబు క్యారెక్టర్ కు ముందుగా దుల్కర్ ను ఎంపిక చేశారు. అయితే డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆయన షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే తప్పుకున్నారు. ఇక ఎన్నో అంచనాల నడుమ విడుదలైన థగ్ లైఫ్ ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచింది. మొత్తానికి లక్ కలిసి రావడంతో దుల్కర్ రెండు డిజాస్టర్స్ నుంచి సేఫ్ అయ్యాడు. ఈ విషయంలో ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి