టాలీవుడ్ ఇండస్ట్రీ లో కథ రచయితగా , స్క్రీన్ పై రైటర్ గా , దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలకు కథా రచయితగా , స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేసి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన సొంతగా సినిమాలకు దర్శకత్వం చేయడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆఖరుగా మహేష్ బాబు హీరో గా గుంటూరు కారం అనే సినిమాను రూపొందించాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ , అల్లు అర్జున్ హీరోగా ఓ భారీ సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికే బన్నీ , అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ కి కమిట్ అయ్యాడు. ఆ సినిమా పూర్తి కావడానికి ఇంకా చాలా కాలం పట్టే అవకాశం ఉంది. దానితో త్రివిక్రమ్ ఆ లోపు ఓ మూవీ ని చేయబోతున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ ప్లాన్ మొత్తం మారిపోయినట్లు తెలుస్తోంది.

తన తదుపరి మూవీ ని త్రివిక్రమ్ , విక్టరీ వెంకటేష్ తో చేయనునట్లు , ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఓ మూవీ చేయనున్నట్లు , అలాగే మరో స్టార్ హీరోతో కూడా త్రివిక్రమ్ మరో మూవీ ని సెట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ ఎక్కువ శాతం ఒక సినిమా సెట్స్ పై ఉండగా మరొక మూవీ ఓకే చేసుకుంటూ ఉంటాడు. కానీ ప్రస్తుతం మాత్రం ఏకంగా ఒకే సారి మూడు సినిమాలను ఓకే చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానితో త్రివిక్రమ్ తన రూట్ మొత్తం మార్చేశాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: