తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ నిర్మాతగా పేరుపొందిన ఏ ఏ ఆర్ట్స్ అధినేత మహేంద్ర గడిచిన కొన్ని గంటల క్రితం అనారోగ్య సమస్యతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈయన వయసు 75 సంవత్సరాలు. మహేంద్ర పార్థివ దేహాన్ని ఈరోజు గుంటూరులోని తన కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు చేయబోతున్నట్లు తెలియజేశారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ సెలబ్రిటీలు, సినీ పెద్దలు సైతం మహేంద్ర అభిమానులు సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు.



మహేంద్ర 1946 ఫిబ్రవరి 4న గుడివాడలో జన్మించారు. దర్శకత్వ శాఖలలో శిక్షణ పొందిన తర్వాత నిర్మాతగా మారారట. అంతేకాకుండా ప్రొడక్షన్ కంట్రోలర్ గా కూడా ఎన్నో చిత్రాలకు పనిచేసిన ఘనత ఉంది మహేంద్ర కు. 1977లో విడుదలైన ప్రేమించి పెళ్లి చేసుకో అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.. ఆ తర్వాత తోడుదొంగలు, ఆరని మంటలు, ఎదురులేని మొనగాడు, బందిపోటు రుద్రమ్మ, కనకదుర్గమ్మ తదితర చిత్రాలను నిర్మించారట మహేంద్ర.


అలాగే శ్రీహరి హీరోగా నటించిన పోలీస్ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు. ఆ తర్వాత మళ్లీ శ్రీహరితోనే దేవా అనే చిత్రాన్ని కూడా నిర్మించారు.. మహేంద్రకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే గడిచిన కొంతకాలం క్రితమే మహేంద్ర కుమారుడు జీతూ మరణించారట. దీంతో అప్పటినుంచి మహేంద్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని సమాచారం. అయితే నిన్నటి రోజున ఈయన గుంటూరులో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ రోజున మహేంద్ర అంత్యక్రియలు గుంటూరులోని జరగబోతున్నాయి. ఏది ఏమైనా ఎలా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను పూర్తి దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. నిన్నటికి నిన్న ప్రముఖ డైరెక్టర్ ఏ ఎస్ రవికుమార్ చౌదరి మరణించగా ఇప్పుడు ప్రొడ్యూసర్ కె మహేంద్ర మరణం అభిమానులను కలవరపాటుకు గురిచేస్తుంది. ప్రస్తుతం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సెలబ్రిటీలు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: