
హైదరాబాద్ ప్రసాద్ లో గ్రాండ్ గా ఈవెంట్ జరగబోతున్నారు . అయితే అక్కడ ప్రభాస్ "ది రాజా సాబ్ " కి సంబంధించిన ఒక పోస్టర్ పెట్టబోతున్నారట . అది కూడా ఒకటి కాదు రెండు కాదు దాదాపు 35 అడుగుల కటౌట్ ని స్పెషల్ గా డిజైన్ చేసి పెట్టబోతున్నారట. దీనితో ఆ టీజర్ లాంచ్ రోజు రచ్చ మామూలుగా ఉండదు అని చెప్పొచ్చు . రెబెల్ అభిమానులు ప్రభాస్ ని ఎంత ఆరాధిస్తారో ఎంత ఇష్టపడతారో అనేది అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ప్రభాస్ లోని కామెడీ యాంగిల్ చూసి చాలా కాలమే అవుతుంది. ది రాజా సాబ్ లో ఆయన కామెడీ యాంగిల్ బయటపడబోతుంది అన్న విషయం ఇట్టే చెప్పొచ్చు .
ఫ్యాన్స్ కి ఇది నిజంగా ఒక బిగ్ డే. ఆ బిగ్ డే ని మరింత స్పెషల్ గా మార్చబోతుంది ఈ 35 అడుగుల కటౌట్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఈ టీజర్ ఈవెంట్లో మరో సర్ ప్రైజ్ కూడా ఉండబోతుందట. బహుశా ఇది సినిమాకి సంబంధించి ఏదైనా బిగ్ అనౌన్స్మెంట్ కూడా ఉండొచ్చు అంటున్నారు జనాలు . ఇక ఈ టీజర్ లాంచ్ ఎన్ని గంటలకు చేస్తారు అనేది ఇంకా తెలియ రాలేదు . ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా రెబల్ స్టార్ ప్రభాస్ లైఫ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అంటూ ఫ్యాన్స్ ఇప్పటినుంచే ధీమా వ్యక్తం చేస్తున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం ఇది మొత్తం హారర్ కామెడీ ధ్రిల్లర్ సినిమా అంటూ తెలుస్తుంది..!