టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున ప్రస్తుతం కెరీర్ పరంగా సరైన దారిలో అడుగులు వేస్తున్నారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. కుబేర సినిమాతో నాగ్ ఖాతాలో మరో భారీ సక్సెస్ చేరింది. ఈ సినిమాలో నాగ్ పోషించిన దీపక్ పాత్ర అదిరిపోయింది. ఈ పాత్రలో నెక్స్ట్ లెవెల్ నటనతో నాగ్ అదరగొట్టారు. నాగ్ పాత్రలో వేరియేషన్స్ అద్భుతంగ ఉన్నాయనే సంగతి తెలిసిందే.

 ఇలాంటి పాత్రలు ఎంచుకుంటే  మాత్రం నాగార్జునకు తిరుగులేనట్టేనని  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  కుబేర  సినిమా డే1 కలెక్షన్లు భారీ స్థాయిలో  ఉన్నాయి.  నైజాంలో ఈ సినిమా 2 కోట్ల 26 లక్షలకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చాయి.  ఏపీ, సీడెడ్ ఏరియాలలో  సైతం ఈ  సినిమా కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది.  నాగార్జున  ఈ సినిమాకు 14 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని  సమాచారం అందుతోంది.

నాగార్జున ప్రస్తుతం కూలీ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా ఆగస్టు నెల 14వ తేదీన  విడుదల కానుంది.  కూలీ సినిమాలో నాగ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న  పాత్రలో కనిపించనున్నారనే  సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రైట్స్  ఒకింత భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.  కూలీ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాపై  అంచనాలు  అంతకంతకూ  పెరుగుతున్నాయి.

నాగార్జున ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.నాగార్జున  నెక్స్ట్ లెవెల్  ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా రాబోయే రోజుల్లో   నాగ్ సక్సెస్ రేట్ అంతకంతకూ పెరుగుతోంది. నాగార్జున బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను  క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  నాగార్జున  పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో  ఇతర భాషల్లో సైతం సత్తా చాటుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: