టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా భారీ బడ్జెట్ తో తన సొంత బ్యానర్ పైన తెరకెక్కించడంతో నిన్నటి రోజున మంచు విష్ణు కార్యాలయంతో పాటు, ఇల్లు అలాగే చిత్ర బృందానికి సంబంధించిన నటీనటుల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ తనికీలు కూడా ముగిసాయని.. మాదాపూర్, కావూరి హిల్స్ వంటి ప్రాంతాలలో ఉన్న కార్యక్రమాలపై రెండు బృందాలు ఒకేసారి తనిఖీలు చేపట్టినట్ల తెలుస్తోంది. ఈ సందర్భంగా కన్నప్ప చిత్రానికి సంబంధించి డాక్యుమెంట్స్, లావాదేవీలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.



పన్ను ఎగ్గొట్టారనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో ప్రాథమిక ఆధారాలు లభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తనిఖీలు జరుగుతున్న సమయంలో విష్ణు కార్యాలయానికి మోహన్ బాబుతో పాటు రచయిత కోన వెంకట్ కూడా వెళ్లినట్లు సమాచారం.. దీంతో మీడియా ప్రతినిధులు జీఎస్టీ దాడుల పైన విష్ణు నీ ప్రశ్నించగా?" మీరు చెబితేనే నాకు తెలిసింది ఏలాంటి విషయాలు నైనా సరే దాచే అవసరం లేదని ఎక్కడెక్కడ అప్పులు చేశామో అందరికీ తెలుస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చారు_.

కన్నప్ప సినిమా విషయానికి వస్తే హిందీ వర్షన్ ఫైనల్ కాపీని కూడా ఇటీవలే చూసామని చివరి సన్నివేశాలలో చాలా ఎమోషనల్ గా ఉన్నదంటూ విష్ణు వెల్లడించారు. ఈ తరం వారికి కన్నప్ప సినిమా కథ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాని తెరకెక్కించామని ఇది దేవుడికి ,భక్తుడు మధ్య జరిగేటటువంటి కథ అంటూ తెలియజేశారు విష్ణు. డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లేవల్లో తెరకెక్కించారు. విష్ణు కన్నప్ప పాత్రలో కనిపిస్తారు.. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్ ,కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ తదితరులు కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.. రేపటి రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. ఇక ఏపీ ప్రభుత్వం కూడా పది రోజులు టికెట్లు పెంచుకొని సదుపాయం కల్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: