సినీ పరిశ్రమలో వరుసగా విషాదఛాయలు సైతం ఎక్కువగా వేలబడుతున్నాయి. ఇప్పటికి చాలామంది ప్రముఖులు సైతం మరణించారు. ఇప్పుడు తాజాగా సినీ ఇండస్ట్రీలో మరొక విషాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నటి మోడల్ షెషాలి జరివాల మరణించారు. ఇమే గుండెపోటుతో మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలోని నిన్నటి రోజున అర్ధరాత్రి సమయంలో షెషాలి జరివాల గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు కూడా వెల్లడిస్తున్నారు. దీంతో ఆమె అభిమానుల సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈమె మృతి పట్ల సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.


నటి షెషాలి జరివాల వయసు 42 సంవత్సరాలు. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించింది. ఈమె పలు రకాల మ్యూజిక్ వీడియోలతో బాగా పాపులారిటీ సంపాదించిన ఈమె హిందీ, కన్నడ వంటి భాషలలో పలు చిత్రాలలో కూడా నటించింది.అలాగే సీరియల్స్ వెబ్ సిరీస్లలో కూడా నటించినట్లు తెలుస్తోంది. హిందీ బిగ్ బాస్ సీజన్ 13 లో కంటెస్టెంట్ గా పాల్గొన్నది. ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న నటి గుండెపోటుతో మరణించిన విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈరోజు సాయంత్రమే నటి అంతక్రియలు జరగబోతున్నట్లు సమాచారం.



2008లో భోగి వోగీ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన షెషాలి జరివాల చివరిగా 2024లో శాంతాన్ని రాస్మిని అనే చిత్రంలో కనిపించింది. మళ్ళీ ఆ తర్వాత కనిపించలేదు. 15 డిసెంబర్ 1982  లో జన్మించిన షెషాలి జరివాల అతి తక్కువ వయసులోనే మరణించింది. ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే 2004లో మీట్ బ్రదర్స్ కు చెందిన సంగీత కళాకారుడు హరిమిత్ సింగ్ ను వివాహం చేసుకుంది. అయితే ఆ తర్వాత 2009లో ఈ జంట విడాకులు తీసుకున్నది. మళ్లీ 2015లో నటుడు పరాగ్ త్యాగిని వివాహం చేసుకుంది. గతంలో తనకి మూర్చ వ్యాధి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానంటు ఒక అనుక సమయంలో వెల్లడించింది షెషాలి జరివాల.

మరింత సమాచారం తెలుసుకోండి: