టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సింహాద్రి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఆది సినిమాతో చిన్న వయసులోనే సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకొని మాస్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న తారక్ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సింహాద్రి అనే మరో పవర్ఫుల్ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

మూవీ తెలుగులో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ ని తమిళ్ లో రీమిక్ చేయాలి అని మొదట అనుకున్న సమయంలో ఆ రీమేక్ మూవీ లో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా నటిస్తే బాగుంటుంది అని కొంత మంది అనుకున్నారట. అందులో భాగంగా ఆయనను కలిసి ఈ విషయం చెప్పగా రజిని మాత్రం సింహాద్రి సినిమా తమిళ రీమిక్ లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదట. ఆ తర్వాత ఈ సినిమా యొక్క తమిళ రీమేక్ హక్కులను కొనుగోలు చేసిన నిర్మాతలు ఈ మూవీ ని విజయ్ కాంత్ హీరోగా తమిళ్లో రూపొందించారు. తెలుగులో అద్భుతమైన విజయం సాధించిన సినిమా కావడంతో ఈ మూవీ పై తమిళ ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కానీ విజయ్ కాంత్ హీరోగా రూపొందిన సింహాద్రి రీమేక్ మూవీ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. దానితో అనేక మంది సింహాద్రి రీమేక్ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. రజనీ కాంత్ ఆ సినిమా చేయకపోవడం మంచి ఆలోచన. రజనీ కాంత్ ఈ రీమేక్ మూవీలో నటించిన కూడా ఈ సినిమా కోలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయేదేమో అని అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేశారు. ఏదేమైనా కూడా తారక్ బ్లాక్ బాస్టర్ మూవీ అయినటువంటి సింహాద్రి ని రజిని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: