
దిల్ రాజ్ నిర్మాణంలో నిర్మింపబడ్డ ఈ మూవీకి దాదాపు 35 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ రేంజ్ బడ్జెట్ నితిన్ సినిమాలకు చాల ఎక్కువ. అయినప్పటికీ వేణు శ్రీరామ్ చెప్పిన కథ అతడి దర్శకత్వ సామర్థ్యం పై నమ్మకం పెట్టుకుని ఈ రేంజ్ లో దిల్ రాజ్ భారీ పెట్టుబడులు పెట్టారు అని అంటున్నారు. ఈమధ్య కాలంలో వరసగా విడుదలైన ‘కుబేర’ ‘కన్నప్ప’ మూవీల హడావిడి తరువాత హడావిడి తగ్గన ధియేటర్లకు ఎంతవరకు ప్రేక్షకులు వస్తారు అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి.
ఈపరిస్థితుల నేపధ్యంలో ఈ సినిమాకు ప్రీమియర్ షోలు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి కారణం ఈమధ్య విడుదలైన ‘కుబేర’ ‘కన్నప్ప’ సినిమాలు ప్రీమియర్ షోలు వేయకుండానే డైరెక్ట్ గా మార్నింగ్ షో తో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు అదే ట్రెండ్ ను కొనసాగించాలని ‘తమ్ముడు’ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈమధ్య కాలంలో ధిల్ రాజ్ సోదరుడు శిరీష్ రామ్ చరణ్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు అంతా శిరీష్ పై తీవ్ర అసహనాన్ని వ్యక్త పరిచారు. దీనితో ఎలర్ట్ అయిన దిల్ రాజ్ శిరీష్ లు నష్ట నివారణ చర్యలు చేపట్టి తమ ఉద్దేశ్యం అది కాదు అంటూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీనితో ఈ మూవీకి ఏమాత్రం డివైడ్ టాక్ వచ్చిన సోషల్ మీడియాలో మెగా అభిమానుల నుండి నెగిటివ్ కామెంట్స్ వచ్చే ఆస్కారం మరింత కనిపిస్తోంది అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనితో ‘తమ్ముడు’ ఫలితం ఎలా ఉంటుంది అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది..