
ఇక మొత్తానికి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చేందుకు పూజా హెగ్డే రెడీ అయింది. రీసెంట్ గా ఈ అమ్మడు బిగ్ ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వస్తున్నాయి. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఓ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ సినిమాతో ఓ కొత్త కుర్రాడు డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. చాలా కాలం క్రితమే ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రకటించబడింది.
అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డేను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయట. ప్రస్తుతం దుల్కర్ `కాంత`, `ఆకాశంలో ఒక తార` అనే సినిమాలు చేస్తున్నాడు. ఇవి కంప్లీట్ అయ్యాక దుల్కర్, పూజా హెగ్డే మూవీ సెట్స్ మీదకు వెళ్ళనుందని అంటున్నారు. ఇక మరోవైపు పూజా హెగ్డే చేతిలో `జన నాయగన్`, `కాంచన 4` చిత్రాలు ఉన్నాయి. త్వరలోనే `కూలీ` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. అదే విధంగా హిందీలో `హై జవానీ తో ఇష్క్ హోనా హై` ఒక సినిమా కూడా చేస్తుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు