"కోట శ్రీనివాసరావు గారు"..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేసిన అవసరం లేదు . ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద సీనియర్ నటుడు . నేడు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు . ఆయన స్వగృహంలో ఆయన కన్నుమూశారు. ఈ విషాదకర వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు కోటా శ్రీనివాసరావు అభిమానులు . అంతేకాదు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు సినీ ప్రముఖులు . స్టార్ హీరోస్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు ,జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి పెద్ద స్టార్స్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు .

కాగా కోటా శ్రీనివాసరావు చివరిగా 2023లో "కబ్జా" అనే సినిమాలో నటించి తెరపై కనిపించారు.  ఆ తర్వాత తెరపై కనిపించలేదు . ఆయనకు సినిమా అవకాశాలు ఇవ్వడానికి డైరెక్టర్ ఇంట్రెస్ట్ చూపించలేదు.  వయసు ఎక్కువగా ఉండడంతో షూటింగ్ సెట్స్ కి వచ్చి ఇబ్బంది పడిపోతాడు అన్న కారణంగా కొంతమంది డైరెక్టర్ లు అవకాశాం ఇవ్వలేదు.  శ్రీనివాసరావు మాత్రం కొందరు డైరెక్టర్ లని.."నటన అంటే ఇష్టం ..నాకు ఆర్టిస్ట్ గా అవకాశాలు ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేశారు ".

కోటా శ్రీనివాసరావు  నటించిన లాస్ట్ సినిమా "కబ్జా" కాదు అని ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో మెరిశారు అని ఓ న్యూస్ బయటకు వచ్చింది . ఆయన ఎంతో ఇష్టంగా ఈ పాత్రలో నటించారట . ఈ పాత్రను తెరపై చూడడానికి ఎంతో కాలం నుండి వెయిట్ చేశారట.  కానీ ఆయన తన కోరిక తీరకుండానే మరణించారు . సిల్వర్ స్క్రీన్ పై హరిహర వీరమల్లు సినిమాలో తన పాత్ర తాను చూసుకోకుండానే ఆయన తుసి శ్వాస విడిచారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇది తెలుసుకున్న అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..!


మరింత సమాచారం తెలుసుకోండి: