కోట శ్రీనివాసరావు గారి మరణం మరువక ముందే మరో దిగ్గజనటి కన్ను మూసింది. అందానికే మారుపేరుగా చెప్పుకునే సరోజ దేవి మరణం సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నింపింది. సరోజా దేవి మరణంతో ఎంతో మంది ప్రముఖులు ఆమెకి నివాళులు అర్పిస్తున్నారు.అయితే సరోజా దేవి మరణంతో ఆమె గురించి కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయట పడుతున్నాయి. అందులో ఒకటే ఇది.అదేంటంటే.. బి సరోజ దేవి అప్పటి ముఖ్యమంత్రి తో ఎఫైర్ పెట్టుకున్నారనే వార్తలు గతంలో చాలా వినిపించాయి.మరి ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే ఏంజిఆర్..సినిమాల్లో, రాజకీయాల్లో రారాజుగా నిలిచిన ఎంజీఆర్ తో బి. సరోజ దేవి దాదాపు 26 సినిమాలు చేసింది.

180 సినిమాల్లో నటించిన సరోజా దేవి ఎంజీఆర్ తో ఏకంగా 26 సినిమాలు చేసింది. అయితే వరుస సినిమాలు ఎంజిఆర్ తో నటించేసరికి వీరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు వినిపించాయి.అంతేకాదు మరో హీరోయిన్ కి ఛాన్స్ ఇవ్వకుండా సరోజా దేవి ఎంజీఆర్ తో కలిసి నటించిందనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక ఇందులో నటించిన మోస్ట్ ఆఫ్ ది సినిమాలు ప్రేమ కథ చిత్రాలే అవ్వడం గమనార్హం. కానీ ఎంజీఆర్ కి అప్పటికే పెళ్లయింది. సరోజ దేవికి పెళ్లి కాలేదు. వీరి మధ్య ఎఫైర్ కొన్ని రోజులు నడిచాక సడన్గా సరోజ దేవి ఎంజీఆర్ ని దూరం పెట్టింది. ఇక ఆయనతో సినిమాలు ఆపేసింది. ఇక సినిమాలు ఆపేసిన తర్వాత సరోజ దేవికి పెళ్లయింది.

పెళ్లయిన సినిమాల్లో రాణించినప్పటికీ ఎంజీఆర్ తో మాత్రం మళ్లీ నటించలేదు. ఎంజీఆర్ సరోజ దేవి మధ్య ఉన్న బంధానికి తెరపడినప్పటికీ ఆయన మీద ఉన్న ప్రేమని సరోజ దేవి మర్చిపోలేకపోయిందట.అందుకే తన కూతురు కొడుకు అంటే సరోజ దేవి తన మనవడికి ఎంజీఆర్ పేరు కలిసి వచ్చేలా గౌతమ్ రామచంద్రన్ అని పెట్టుకుందని గతంలో సినీ విశ్లేషకులు అయినటువంటి కిరణ్ ప్రభ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు. అలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక సరోజా దేవి ఇంజనీర్ అయినటువంటి శ్రీహర్షని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: