మాస్ మహారాజా రవితేజ తండ్రి తాజాగా మరణించినట్టు ఇండస్ట్రీ సన్నిహిత వర్గాలు తెలియజేస్తాయి.. మాస్ మహారాజాగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవితేజ తండ్రి పేరు భూపతి రాజగోపాల రాజు.ఆయన కి 90 ఏళ్ల వయసు.. కాగా వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా భూపతి రాజగోపాల రాజు మరణించినట్టు రవితేజ సన్నిహితులు  తెలియజేశారు.ఇక ఈయన రవితేజ నివాసంలోనే నిన్న రాత్రి కన్నుమూసినట్టు తెలిపారు.. ఇక రవితేజ తండ్రి భూపతి రాజగోపాల రాజు ఏపీలోని జగ్గంపేట కి చెందినవారు. ఆయన ఫార్మసిస్టుగా పనిచేశారు. ఇక భూపతి రాజగోపాల్ రాజుకి ముగ్గురు కొడుకులు అందులో పెద్దవాడే రవితేజ.. ఆ తర్వాత రఘు,భరత్ లు కూడా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న నటులే.. 

కాగా ముగ్గురు కొడుకుల్లో రవితేజ రెండో తమ్ముడు అయినటువంటి భరత్ 2017 లో జరిగిన కారు యాక్సిడెంట్ లో మరణించిన సంగతి మనకు తెలిసిందే.. ఇక కళ్ళముందే కొడుకు మరణించడంతో అప్పటినుండి చాలా రోజులు రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు డిప్రెషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.. అలా ఇండస్ట్రీలో ఒక విషాదం మరువకముందే మరో విషాద వార్త వినాల్సి వస్తుంది. కోటా శ్రీనివాసరావు మరణం మరవకముందే లెజెండ్రీ నటి బి. సరోజ దేవి మరణించారు. సరోజి దేవి మరణ వార్త మరువకముందే మళ్ళీ రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. ప్రస్తుతం రవితేజ తండ్రి మరణించారు అనే వార్త వినడంతోనే ఇండస్ట్రీలో

 ఇక రవితేజ కుటుంబం సంపన్నుల కుటుంబమే అయినప్పటికీ రవితేజకు సినిమాల మీద పిచ్చి ఉండేదట. అలా రవితేజ తండ్రి పాకెట్ మనీ కి ఇచ్చిన డబ్బులను సినిమా చూడడం కోసం ఖర్చు చేసే వారట. అంతేకాకుండా సినిమా చూడడానికి డబ్బులు చాలకపోతే తల్లి దాచిన డబ్బులు కొట్టేసేవారట. అలా సినిమాలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన రవితేజ సింధూరం, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ వంటి సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగారు. ఇక ఇడియట్ సినిమా తర్వాత రవితేజ కెరీర్ లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఇక ప్రస్తుతం రవితేజ మాస్ జాతర సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: