తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నటీమణులలో ఒకరు అయినటువంటి నీది అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె సవ్యసాచి అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈమె నటించిన మిస్టర్ మజ్ను మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అలా వరుసగా రెండు అపజయలను అందుకున్న తర్వాత ఈస్మార్ట్ శంకర్ మూవీ తో మంచి విజయాన్ని , మంచి క్రేజ్ ను ఈ బ్యూటీ సంపాదించుకుంది. తాజాగా ఈ నటి పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన హరిహర వీరమల్లు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

మూవీ జూలై 24 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం నిధి అగర్వాల్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ ముద్దు గుమ్మ రాజా సాబ్ మూవీ షూటింగ్ వివరాలను ,  అలాగే ఆ సినిమాలో తన పాత్రకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్లను తెలియజేసింది.

తాజాగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ ...  రాజా సాబ్ మూవీ కి సంబంధించిన సాంగ్స్ , ప్యాచ్ వర్క్ , షూటింగ్ పూర్తి కావలసి ఉన్నట్లు నిధి అగర్వాల్ తాజాగా చెప్పుకొచ్చింది. ఈ మూవీ లో తాను నన్ మరియు ఏంజెల్ పాత్రలో కనిపిస్తాను అని ఆమె చెప్పింది. అలాగే ఈ మూవీ లో తాను దయ్యం పాత్రలో అస్సలు కనిపించడం లేదు అని కూడా ఆమె తెలియజేసింది. ఇకపోతే పౌరాణిక సినిమాల్లో నటించాలని ఉన్నట్లు ఈమె తెలియజేసింది. రాముడు లాంటి భర్త కావాలి అని ఈమె తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Na