ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ ల ప్రభావం బాగా పెరిగాక కొన్ని సినిమాలకు థియేటర్లలో పెద్దగా కలెక్షన్లు రాకపోయినా ఓటీ టీ లో మాత్రం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటివరకు అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినవి కూడా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో అద్భుతమైన ప్రేక్షకదరణ పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ తెలుగు సినిమాకి కూడా ఇలానే జరిగింది. అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , మంచు మనోజ్ , నారా రోహిత్ ప్రధాన పాత్రలలో విజయ్ కెనకమేడల దర్శకత్వంలో భైరవం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో ముగ్గురు హీరోలు నటించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర  కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయిన ఈ సినిమా తాజాగా జీ 5 ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

ఈ సినిమాకు ఓ టి టి ప్లాట్ ఫామ్ లో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ జనాల లభిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా జీ 5 ఓ టీ టీ సంస్థ  వారు ఈ సినిమా గ్లోబల్ గా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించింది. దీనిని బట్టిని చూస్తే బాక్సా ఫీస్ దగ్గర ఈ సినిమా ప్రేక్షకుదరణ పొందకపోయిన ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ ను జనాల నుండి దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: