
ఈ ఫ్లాట్ ను రూ.70 లక్షల రూపాయలకు మరొక వ్యక్తికి విజయ్ చౌదరి అమ్మగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆ వ్యక్తి చూడగా అసలు విషయం బయటపడింది. నటుడు రాజీవ్ కనకాల చాలా తెలివిగానే ఈ లిటిగేషన్ ఫ్లాట్ ని నిర్మాత విజయ్ చౌదరికి అమ్మేశాడని.. కానీ విజయ్ చౌదరి దగ్గర నుంచి మరొక వ్యక్తి తన పేరు మీదికి మార్చుకోవాలని ప్రయత్నాలు చేసినప్పుడు అక్కడ అసలు ప్లాట్ లేదని విషయం బయటపడడంతో ఆ వ్యక్తి ఆశ్చర్యపోయారు.
దీంతో సదురు వ్యక్తి విజయ్ చౌదరి పైన హయత్ నగర్ లో కేసు పెట్టడం జరిగింది. విజయ్ చౌదరిని విచారించిన పోలీసులు అనంతరం తాను నటుడు రాజీవ్ కనకాల వద్ద కొనుగోలు చేశానంటూ తెలియజేశారట. దీంతో రాజీవ్ కనకాల తనని మోసం చేశారంటూ నిర్మాత విజయ్ చౌదరి కూడా ఫిర్యాదు చేశారు.. అసలు లేని ప్లాటును ఉన్నట్టుగా చూపించి తమని మోసం చేశారంటూ సినీ నటుడు రాజీవ్ కనకాలపై రాచకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వడంతో నోటీసులు పంపించారు. మరి ఈ విషయంపై రాజీవ్ కనకాల ఎలా స్పందిస్తారో చూడాలి