
ఖుషి సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ ఎలా నటించారో హరిహర వీరమల్లు సినిమాలో కూడా అలాగే నటించారని అభిమానులు తెలుపుతున్నారు. డైలాగ్ డెలివరీ గురించి కూడా అద్భుతంగా చెప్పారని ఇంకో పదేళ్ల తర్వాత కూడా పవర్ స్టార్ డైలాగులు అంటే ఆడియన్స్ కిక్కెక్కించేలా ఉన్నాయంటూ తెలుపుతున్నారు. యాక్షన్స్ సన్నివేశాలతో పవర్ స్టార్ తన పవర్ ని చూపించారనే విధంగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. శత్రువులకు వార్నింగ్ ఇచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి.
సినిమా విడుదల సమయం వరకు కూడా హరిహర వీరమల్లు సినిమాకి బజ్ కనిపించలేదు. కానీ విడుదలైన తర్వాత మాత్రం ఇంతటి బజ్ క్రియేట్ అయ్యిందంటే కేవలం అది పవర్ స్టార్ మానియా వల్లే అంటూ అభిమానులు తెలియజేస్తున్నారు. టాలీవుడ్ లో ఎప్పటికీ పవన్ కళ్యాణ్ అనే పేరు తగ్గని క్రేజీగా మారిపోయిందని అందుకే ఆయనను పవర్ స్టార్ అని పిలుస్తారని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇక మొదటి రోజు కలెక్షన్స్ కూడా 50 కోట్లకు పైగానే రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. నిధి అగర్వాల్, బాబీ డియోల్, సునీల్, సుబ్బరాజు తదితర నటీనటులు నటించారు. అలాగే తదుపరిచిత్రం ఓజీ కూడా ఈ ఏడాది విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఓజి సినిమాపై అభిమానులకు భారీగానే అంచనాలు కనిపిస్తున్నాయి. డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.