
దర్శకుడు హరీష్ శంకర్ అంటే పవన్ కళ్యాణ్ కి ఎంత ఇష్టం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ కి మంచి హిట్ ఇచ్చాడు . అంతేకాదు పవన్ కళ్యాణ్ కెరియర్ లో కొంతమంది డైరెక్టర్స్ ను బాగా నమ్ముతూ ఉంటారు. అందులో ఒకరు హరీష్ శంకర్ . కాగా ప్రజెంట్ "ఉస్తాద్ భగత్ సింగ్" అనే సినిమాను హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో షూట్ కంప్లీట్ అవ్వాలి. 2024లో ఏపీలో జనసేన భాగస్వామిగా ఉన్న కూటమి ఘనవిజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆయన బిజీబిజీగా మారిపోయారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యంగా ముందుకు వెళ్తుంది .
అయితే ఈ సినిమా షూటింగ్ కి పవన్ కళ్యాణ్ కొన్ని టైం కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసిన హరీష్ శంకర్ పెద్దగా ఉపయోగించుకోవట్లేదు అని హరిశంకర్ వేరే కొన్ని పనుల్లో బిజీ అవుతు డిప్యూటీ సీఎం సినిమాని నెగ్లెట్ చేస్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఎందుకు సినిమా లేటవుతుంది అంటే పవన్ కళ్యాణ్ కాల్ షీట్ ఇవ్వట్లేదు అని అందరికీ చెప్పుకొని తిరుగుతున్నాడు హరీష్ శంకర్ అంటూ రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ -హరీష్ శంకర్ పై సీరియస్ అవుతున్నాడు అన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. హరీష్ శంకర్ తప్పుదారిలో వెళ్తున్నాడు అని "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమా షూట్ ను పూర్తిగా పెడదారిన పెట్టేస్తున్నాడు అని ..పవన్ కళ్యాణ్ - హరిష్ శంకర్ పై సీరియస్ అయ్యారట . ఇలా అయితే ఇక నీకు ఇండస్ట్రీలో కెరియర్ ఉండదు అంటూ సివియర్ వార్నింగ్ కూడా ఇచ్చారట . ఇది కేవలం ఒక పుకారు మాత్రమే. పవన్ కళ్యాణ్ ఏ విధంగా హరిశంకర్ కి వార్నింగ్ ఇవ్వలేదు . ఎవరో గిట్టని వాళ్ళే ఇలా హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ వార్తలను సృష్టిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు..!!