యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన వార్2 సినిమా నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వార్2 మూవీ హిందీ ట్రైలర్ కు 23 మిలియన్ల వ్యూస్ రాగా వార్2 మూవీ తెలుగు ట్రైలర్ కు 22 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. వార్2 ట్రైలర్ లో హృతిక్ మోకాళ్లపై నిలబడి ఎన్టీఆర్ తన ముందు ఉన్న షాట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.

ఈ ఒక్క షాట్ తో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నే డామినేట్ చేశాడుగా అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ  ఉండటం గమనార్హం.  వార్2 ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో సంచలనాలను  సృష్టిస్తుందో  చూడాల్సి ఉంది.   నిర్మాత నాగవంశీకి ఈ సినిమా కచ్చితంగా లాభాలను అందించే సినిమా అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

నెల రోజుల్లో నాగవంశీ మూడు సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.  ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలను సృస్తిస్తుందో చూడాల్సి  ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. విక్రమ్ రోల్ తారక్ కెరీర్ లో స్పెషల్ రోల్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వార్2 సినిమా బాక్సాఫీస్ వద్ద  ఏ స్థాయిలో సంచలనాలను సృస్తిస్తుందో చూడాల్సి ఉంది. వార్2 సినిమా తారక్ కెరీర్ లో మెమరబుల్ సినిమాగా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.  వార్2  సినిమా ప్రమోషన్స్ కూడా త్వరలో మొదలుకానున్నాయి. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సైతం నిర్వహించనున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే  అవకాశాలు అయితే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: