
అయితే తాజాగా అలాంటి హర్టింగ్ కామెంట్స్ పై స్పందించింది విద్యాబాలన్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన బరువు గురించి ట్రోల్స్ గురించి మాట్లాడింది . ఆమె మాట్లాడుతూ.." నేను ఒక సిగ్గులేని ఆడదాన్ని.. నాకు ఆత్మవిశ్వాసం చాలా చాలా ఎక్కువ. అందుకే బరువు గురించి ఎంతమంది నన్ను ట్రోల్ చేస్తున్నా ఏడుస్తూ కూర్చోలేదు . వెనక్కి తగ్గలేదు . అలా బరువు ఉన్నప్పుడే లీడ్ రోల్స్ లో నటించాను.. నా బరువు నాకు ఏమీ బరువు కాదు అని ప్రూవ్ చేసుకున్నాను"..
" నా పాత్ర నాకు సెట్ అవ్వదేమో అని చాలామంది నా వెనకాల మాట్లాడుకున్నారు . చుట్టూ జనాలు ఎంతమంది ఎన్ని మాటలు అన్న బరువు తగ్గాలని సూచించిన నేను ఏ మాత్రం బాధపడలేదు. నా ప్రయత్నం నేను చేశాను.. వ్యాయామాలు చేశాను ,డైట్ చేశాను , నాన్ వెజ్ మొత్తం మానేశాను.. కానీ తగ్గలేదు . కొంచెం బరువు తగ్గిన మళ్లీ ఆ తర్వాత యధాస్థితికి చేరుకునేస్తాను. అయినా కూడా నేను వర్కౌట్ చేస్తూనే ఉన్నాను .. ప్రతి మనిషికి కొన్ని ఫ్లాస్ ఉంటాయి నాలో ఇదే ఫ్లా ఏమో..? అన్ని కాయగూరలు అందరికీ సెట్ అవ్వవు.. నా బాడీకి కొన్ని కాయగూరలు సరిపడవు .. ఆ కారణంగానే బరువు ఎక్కువగా తగ్గలేకపోవచ్చు " అని చెప్పుకొచ్చింది . ప్రస్తుతం ఈమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి . విద్యాబాలన్ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది . మరొక పక్క వెబ్ సిరీస్ లల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది.