పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితమే సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే మూవీ ని మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొంత కాలానికే ఈ సినిమాకు సంబంధించిన ఓ చిన్న గ్లీమ్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. దానికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.

దానితో ఒక్క సారిగా ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయం లోనే పవన్ రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో కొంత కాలం పాటు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగ వంతంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 1 వ తేదీన ఈ మూవీ యొక్క ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల అయింది. దానితోనే పవన్ అభిమానులు ఆనంద పడుతున్నారు. మరి కొన్ని రోజుల్లోనే ఓజి మూవీ ఫస్ట్ సింగిల్ కూడా విడుదల కానున్నట్లు వార్తలు రావడంతో వారి ఆనందం మరింత పెరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

pk