గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఉప్పెన సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని దర్శకుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న బుచ్చిబాబు సన ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ , జగపతిబాబు , దివ్యాందు కీలకమైన పాత్రలలో కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

ఇది ఇలా ఉంటే చాలా కాలం నుండి మెగా ఫ్యాన్స్ ఈ సినిమా నుండి మొదటి సాంగ్ ను ఎప్పుడు విడుదల చేస్తారా అనే అప్డేట్ గురించి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరి ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ను ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా విడుదల చేస్తారా ..? లేదా అనేది చూడాలి. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తూ ఉండడంతో ... ఈ మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ సంగీతం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇప్పటికే ఈ మూవీ నుండి ఫస్ట్ షార్ట్ పేరుతో మేకర్స్ ఓ గ్లీమ్స్  వీడియోని విడుదల చేయగా అది అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ పై అంచనాలు కూడా ఒక్క సారిగా భారీగా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: