అవతార్ 3 కోసం ఎంతోమంది అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అవతార్ ఫ్రాంచైజీలో భాగంగా అవతార్ 3 రాబోతోంది. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్లలో ఒకరైన జేమ్స్ కెమెరాన్ మళ్లీ తన విజువల్ మాయాజాలంతో ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు రెండు భాగాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ ఇప్పుడు మూడవ భాగాన్ని రూపొందించారు. అందుకు సంబంధించి అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమాకి సంబంధించి తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి కూడా భారీగానే బడ్జెట్ పెట్టినట్లు సమాచారం.


అవతార్ 3 లో పరిచయం కాబోతున్న వరంగ్ ఫస్ట్ లుక్ ను మేకర్స్  సైతం ఇటీవలే విడుదల చేయడం జరిగింది.. అగ్ని శక్తులతో కూడినటువంటి నేవీ గణానికి చెందిన వరంగ్ క్యారెక్టర్ ఇందులో  మిస్టీరియస్ గా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. అభిమానులు అవతార్ 3 ట్రైలర్ మరింత ఆసక్తిని కనిపించేలా తీర్చిదిద్దారు డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్. ట్రైలర్లో కొత్త అగ్ని నేవీ తెగలు, పాండోరా మళ్ళీ ఎదుర్కొంటున్న మానవ ముప్పు ఇబ్బందులను చాలా అద్భుతంగా చూపించారు.

అలాగే ఇందులో కొన్ని కొత్త ఎమోషనల్ కోణాలను కూడా అద్భుతంగా చూపించారు. గత చిత్రాలకు మించి ఈసారి విజువల్ వండర్ ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలను సైతం మరింత ఎక్సైటింగ్ అయ్యేలా చేసేలా కనిపిస్తోంది అవతార్ 3 ట్రైలర్. డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. వీటికి తోడు అవతార్ 4.. 2029 లో ఉండబోతుందని.. అవతార్ 5.. డిసెంబర్ 2031 లో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ఇందుకు సంబంధించి అన్నిటిని ప్లాన్ చేసుకొని ప్రకటించారు.. మొత్తానికి అవతార్ 3 ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని కూడా అద్భుతంగా అద్భురపరిచేలా కనిపిస్తోంది. మరి ఈసారి అవతార్ 3 ఎలాంటి రికార్డులను తిరగా రాస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: