సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే అదృష్టంతో పాటు తెలివైన వ్యూహాలు ఉండాలి. వరుస ఫ్లాపుల వల్ల మూడు నాలుగు బ్యానర్లు మినహా మిగతా బ్యానర్ల నిర్మాతలు సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. అల్లు అరవింద్ నిర్మాతగా ఈ ఏడాది తండేల్ సినిమాతో సక్సెస్ సొంతం చేసుకోగా డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఆయనకు భారీ స్థాయిలో లాభాలు దక్కుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

గతంలో కాంతారా, 2018 సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి  భారీ లాభాలను అందుకున్న ఈ నిర్మాత  మహావతార నరసింహ సినిమాను కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి భారీ లాభాలను సొంతం చేసుకుంటున్నారు. హరిహర వీరమల్లు సినిమాకు పోటీగా  ఈ సినిమా విడుదల కాగా ఆ సినిమా కంటే ఈ సినిమాకే ఎక్కువ సంఖ్యలో  టికెట్స్ బుక్ అవుతుండటం గమనార్హం.  హోంబలే ఫిలిమ్స్ నిర్మాతలు యానిమేషన్ ఫిలిమ్స్ తో సైతం సత్తా చాటుతున్నారు.

కొన్ని ప్రాంతాలలో హరిహర వీరమల్లు సినిమాను సైతం తప్పించి ఈ సినిమాకు స్క్రీన్లు కేటాయిస్తున్నారని  వార్తలు వస్తున్నాయి.  చాలా తక్కువ మొత్తానికే అల్లు అరవింద్సినిమా హక్కులను  సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.  నిర్మాత అల్లు అరవింద్ కు మహావతార నరసింహ సినిమా రూపంలో వరం దక్కిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఇప్పటివరకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు 8 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు  వచ్చాయి.  సెకండ్ వీకెండ్ లో సైతం ఈ సినిమా దూకుడు కొనసాగే ఛాన్స్ అయితే ఉంది.  టైర్2, టైర్3 ఏరియాలలో సైతం ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొడుతూ ఉండటం గమనార్హం. డిస్ట్రిబ్యూషన్ విషయంలో అల్లు అరవింద్ కు తిరుగులేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ  ఉన్నాయి. అల్లు అరవింద్ రేంజ్ అంతకంతకు పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: