బెట్టింగ్ యాప్స్ కేసులో భాగంగా ఈడీ అధికారులు తాజాగా దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా సినీ సెలబ్రిటీలు రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్ కు నోటీసులను జారీ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ ఈడి అధికారుల ముందు హాజరైనట్లుగా తెలుస్తోంది. తెలంగాణ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈ దర్యాప్తు కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్ లకు సంబంధించి అలాగే మనీలాండరింగ్, హవాలా లావాదేవుల విషయంపై పలువురు సెలబ్రిటీల పైన ఆరోపణలతో ఈడి ఫోకస్ చేసింది.



మొత్తం మీద 36 బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి సెలబ్రిటీలకు పై కేసు నమోదు అయింది. ఈ విషయంపై ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈడీ అధికారుల ముందుకు హాజరయ్యారు. ఒక బెట్టింగ్ యాడ్ ప్రమోషన్స్ లో ప్రకాష్ రాజ్ నటించడంతో ఈ నటుడు పైన కేసు నమోదు అయ్యింది. సుమారుగా 10 రోజుల క్రితం నోటీసులు పంపించగా ఈ రోజున ఈడీ అధికారుల ముందుకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ లకు సంబంధించి అగ్రిమెంట్లు బ్యాంకు లావాదేవుల విషయాలను తీసుకురావాలని అధికారులు ఆదేశాలను జారీ చేశారు.


ఇక ఈ కేసులో పేరు ఉన్న మిగతా నటీనటులకు సైతం దశలవారీగా విచారణ చేపట్టనున్నారు.. ఆగస్టు 13న మంచు లక్ష్మికి ఎంక్వయిరీ కి రావాలని నోటీసులను జారీ చేశారు. ఈ కేసులో సుమారుగా 29 మంది నటీనటులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ పైన విచారణ జరగబోతోంది. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ విషయంలో సైబరాబాద్, పంజాగుట్ట, విశాఖపట్నం తదితర వంటి ప్రాంతాలలో పోలీస్ కేసులు నమోదు కావడంతో ఈ ఎఫ్ఐఆర్ ల ఆధారంగానే ఈడి అధికారులు రంగంలోకి దిగి మరి విచారణ చేయబడుతున్నారు. చాలామంది బెట్టింగ్ యాప్స్ ల వల్ల డబ్బులు నష్టపోయి అప్పులు చేసి మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో మరింత అధికారులు ఫోకస్ చేసి వీటిని అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: