సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో మెంటల్ ఎక్కిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా అసలు ఈ కాంబో ఇంకొకసారి సెట్ అవుతుందా ..? అని ఎప్పటినుంచో వెయిట్ చేసే ఫ్యాన్స్ కు అలాంటి కాంబో సెట్ అయితే మాత్రం నో డౌట్ ఫ్యుజులు ఎగిరిపోతాయి . ప్రెసెంట్ అలాంటి ఒక ఎంజాయ్మెంట్ ను ఆస్వాదిస్తున్నారు  రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ . ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టార్ హీరో. మరి ముఖ్యంగా ప్రెసెంట్ ఆయన నటిస్తున్న సినిమాలు మొత్తం కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు .

అంతేకాదు ప్రభాస్ ఖాతాలో ఉన్న సినిమాలు చూస్తే ఖచ్చితంగా నెక్స్ట్ మూడు నాలుగేళ్లు ఇండస్ట్రీ మొత్తం ప్రభాస్ చేతుల్లోనే ఉంటుంది అని చెప్పుకోక తప్పదు.  ఇలాంటి మూమెంట్లోనే మరొక క్రేజీ కాంబో చేశాడు ప్రభాస్ అంటూ టాక్ వినిపిస్తుంది . పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  దానికి కారణం రీసెంట్గా "రాజా సాబ్" సినిమా సెట్స్ లో పూరి జగన్నాథ్ కనిపించడమే . అంతే కాదు వీళ్ళిద్దరూ ఆప్యాయంగా హగ్  చేసుకున్న ఫోటో ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది .

వీళ్ళ కాంబోలో వచ్చిన "బుజ్జిగాడు" సినిమా ఏ  రేంజ్ లో ఇండస్ట్రీని ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పాలా..? అసలకు  ప్రభాస్ ని డార్లింగ్ అంటూ పిలిచింది ఆ మూవీ నుంచే.  వీళ్ళిద్దరు "రాజా సాబ్" షూట్ సెట్స్ లో ఆత్మీయంగా హగ్ చేసుకున్న ఫోటో ఇప్పుడు సినిమా ఇండస్ట్రిలో ట్రెండ్ అవుతుంది. అంతే కాదు వీళ్ళిద్దరి కాంబో సెట్ అయింది అంటూ కూడా ఫిల్మ్ వర్గాలలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది . నిజంగా ఇలాంటి ఒక కాంబో సెట్ అయితే మాత్రం నో డౌట్ ఆర్ఆర్ఆర్ , బాహుబలి రికార్డ్స్ తుడిచిపెట్టుకుపోయేలా కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుంది మూవీ . చూడాలి మరి ఇది ఎప్పుడు వర్క్ అవుట్ అవుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: