పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో భారీ అంచనాలు ఉన్న చిత్రం ఓజి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తోనే పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చినా సరే భారీ లెవల్లో హైప్ ఏర్పడింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే సంగీత దర్శకుడు థమన్ సాంగ్ పైన లేటెస్ట్ ఇచ్చిన హింట్ అభిమానులు చాలా ఎక్సైటింగ్ కి గురిచేస్తోంది.


థమన్ తన ట్విట్టర్ నుంచి ఒక గన్ ఎమోజి పెట్టి కల్ట్స్ అంటూ చిన్న పోస్ట్ ని షేర్ చేశారు. దీంతో ఓజి సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఈ అలర్ట్ ఇచ్చారన్నట్లుగా అభిమానులు అర్థం చేసుకుంటున్నారు. ఫస్ట్ సింగిల్స్ ని మేకర్స్ వచ్చే నెలలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. దీనిపైన ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు.. ఈ చిత్రాన్ని డివీవీ ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం.


ఓజి చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటించగా ,ఇమ్రాన్ హస్మి విలన్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ తదితర నటీనటులు ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. సుమారుగా రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి. ఇటీవలే హరిహర వీరమల్లు సినిమా విడుదలవ్వగా ఈ సినిమా అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. కలెక్షన్స్ విషయంలో కూడా భారీగా తగ్గినట్లుగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం రూ .100 కోట్లు మార్కును మాత్రమే అందుకున్నట్లు సమాచారం. దీంతో ఓజి సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు

మరింత సమాచారం తెలుసుకోండి: