నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఎవరితోనైనా సినిమా చేస్తాను అని మాట ఇస్తే ఆ దర్శకుడికి హిట్స్ ఉన్నాయా ..? ప్లాప్స్ ఉన్నాయా ..? అతని కెరియర్ ఎలా నడుస్తుంది అనేది పెద్దగా పట్టించుకోకుండా అతనికి సినిమా అవకాశం ఇస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలయ్య ఒక విషయంలో ఒకే ఫార్ములా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. అది ఇందులో అనుకుంటున్నారా  ..? తన నెక్స్ట్ మూవీల దర్శకులను ఎంచుకునే విషయంలో. బాలయ్య ప్రస్తుతం చేస్తున్న ,  అలాగే చెయ్యబోయే తదుపరి రెండు మూవీల విషయంలో కూడా తనతో ఆల్రెడీ సినిమాలను రూపొందించి మంచి విజయాలను అందించిన దర్శకులతోనే ముందుకు వెళుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. గతంలో బాలయ్య , బోయపాటి కాంబోలో సింహ , లెజెండ్ , అఖండ అనే సినిమాలు వచ్చాయి.

ఈ మూడు మూవీలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.  ఈ సినిమా తర్వాత బాలయ్య , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు. బాలయ్య , గోపీచంద్ కాంబోలో గతంలో వీర సింహా రెడ్డి అనే సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే సినిమా తర్వాత సినిమాను కూడా బాలయ్య ఇప్పటికే ఓకే చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వారిలో ఒకరు అయినటువంటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య , క్రష్ జాగర్లమూడి  కాంబోలో మొదటగా గౌతమీపుత్ర శాతకర్ణి అనే సినిమా వచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

బాలయ్య , క్రిష్ కాంబోలో గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమా వచ్చాక వీరి కాంబోలో ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు అనే రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర భారీ అపజయలను ఎదుర్కున్నాయి. తనకు వరసగా రెండు అపజయాలను ఇచ్చిన క్రిష్ తో బాలయ్య మరో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్రిష్ , బాలయ్య కు ఓ కథను వినిపించగా అది బాగా నచ్చడంతో బాలయ్య , క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొంత కాలం లోనే వెలవడనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: