
2023లో తన కూతురు కల్పిక ఆశ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నట్లుగా ఈ ఫిర్యాదులో తెలియజేయడం జరిగింది. అనంతరం అందుకు సంబంధించి ఈమె మెడిసిన్ కూడా తీసుకుంటున్నదంటూ తెలియజేశారు. అయితే ఆ తర్వాత రెండేళ్లుగా ఈ మెడిసిన్ ని ఆపివేసిందని దీంతో ఈమె తరచూ ఇలా గొడవలకు కారణమవుతొందని ఫిర్యాదులో తెలియజేశారట. కల్పిక వల్ల ఆమెకు , ఆమె కుటుంబ సభ్యులకు సైతం సాధారణ ప్రజల నుంచి ప్రమాదం ఉన్నదంటూ తాజాగా గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
కల్పికను రిహాబిలేటేషన్ సెంటర్ కి తరలించామని అయితే ఆమె అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి తరచూ ఏదో ఒక న్యూస్ లో డిస్టబెన్స్ సృష్టిస్తోంది అంటూ తెలియజేశారు. దీంతో తిరిగి ఆమెను రిహాబిలేటేషన్ సెంటర్ కు తరలించే విధంగా చర్యలు చేపట్టాలి అంటూ కల్పిక తండ్రి సంఘవార్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారట.దీంతో తండ్రి ఫిర్యాదు మేరకు నటి కల్పిక పైన సెక్షన్ 23 మెంటల్ హెల్త్ ఆక్ట్ ప్రకారం గచ్చిబౌలిలో ఈమె పైన పోలీస్ కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఒక ఫామ్ హౌస్ లో కూడా కల్పిక సిబ్బందితో గొడవ దిగింది. ఈ క్రమంలోనే ఈమె పైన చాలా కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కొన్ని అసభ్యకరమైన పోస్టులు పెడుతూ చాలా వింతగా ప్రవర్తిస్తున్నది.