ఇప్పుడు సినిమా ప్రపంచంలో ఒకే మాట – "సైయారా రేంజ్ వేరు!" ఓ సాధారణ లవ్ స్టోరీ అనే ముసుగులో వచ్చిన ఈ మూవీ … బాక్సాఫీస్ వద్ద మాస్ సినిమాలా దుమ్ముదులిపేస్తోంది. స్టార్ హీరో లేకున్నా, పాన్ ఇండియా ప్రమోషన్ కాకున్నా… కేవలం కంటెంట్, ఎమోషన్, కమర్షియల్ మిక్స్‌తో సైయారా మెరుపులు చిందిస్తోంది. సినిమా బడ్జెట్ కేవలం 30 కోట్లు. కానీ వసూళ్లు మాత్రం ఏ లెవెల్లో జరుగుతున్నాయంటే … ఓవర్సీస్‌లో చావా సినిమా రికార్డులను రెండో వారానికే క్రాస్ చేసింది. చావా మొత్తం వసూళ్లు 91 కోట్లు కాగా, సైయారా ఇప్పటికే 94 కోట్లు దాటేసి… 100 కోట్లు టార్గెట్ గా పెట్టుకుంది. ఇది ఏ రేంజ్ ఫీట్ అంటే… పెద్ద హీరో సినిమాలకు ఇది సాధ్యపడని పని. కానీ సైయారా చేసింది!


ఇదే కాదు – సినిమా గ్రాస్ వసూళ్లు 400 కోట్లను దాటేసాయి. వచ్చే వీకెండ్‌లో  500 కోట్లు పూర్తవుతుందన్న అంచనా. దీని తర్వాత కొత్త రిలీజులు – హరిహర వీరమల్లు, మహావతార్ నరసింహ, సామ్రాజ్య, సన్నాఫ్ సర్దార్ 2, ధఢక్ 2 – లాంటివి ఎన్ని వచ్చినా, వస్తున్నా కూడా సైయారా హవా తగ్గేలా కనిపించడంలేదు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో.. వారి మార్కెటింగ్ స్కిల్స్ బ్రహ్మాండంగా పనిచేశాయి. మొదటి రోజు ఆఫర్స్, సింగిల్ స్క్రీన్ స్పెషల్ ప్రీమియర్స్, యూత్ టార్గెట్ చేసిన క్యాంపెయిన్ అన్నీ కలిపి హైప్ పెంచాయి. తర్వాత కంటెంట్ బలంతో జనం రిపీట్ ఆడియన్స్ అయ్యారు. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే సైయారా భీకరంగా దూసుకెళ్తోంది.



విచిత్రం ఏంటంటే – తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా థర్డ్ వీక్‌లో హౌస్‌ఫుల్ షోలు కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లో కూడా టికెట్లు దొరకడం కష్టం! షారుఖ్, సల్మాన్ సినిమాలు కొన్ని ఏరియాల్లో రెండో వారం తరువాత డ్రాప్ అవుతుంటే, ఇది ఓ కొత్త జంట నటించిన మూవీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఇది అసాధారణం అనే చెప్పాలి. హీరో ఆహాన్ పాండే ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయాడు. బాలీవుడ్‌కు మరో లవ్ బాయ్ దొరికాడనే వాతావరణం. హీరోయిన్ అనీత్ పడ్డా ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. డైరెక్టర్ మోహిత్ సూరికి తిరిగి ఓ పక్కా బ్రేక్ వచ్చింది. ఇప్పుడు ఇతనితో మూవీ చేయాలని చాలామంది వెనకబడిపోతున్నారు.



ఇంతకీ సైయారాని ఆపగలిగేది ఏ సినిమా? .. ప్రస్తుతం పోటీగా ఉన్న వార్ 2 లేదా కూలీ (సల్మాన్ ఖాన్ మూవీ) ఓ పక్కన ఉన్నాయి. కానీ అప్ప‌టి వరకూ మాత్రం సైయారా పగ్గాలు వదిలేలా కనిపించడం లేదు. లవ్ స్టోరీలు ఇలా ఊహించని రేంజ్‌లో హిట్టవడం అరుదు. కానీ ఇది జరిగింది. మళ్లీ మాస్ ఆడియన్స్ రొమాంటిక్ డ్రామాల వైపు తిరుగుతున్నారా? అనే ప్రశ్నకు సైయారా బలమైన సమాధానమైంది. ఇంతకీ ఇది ప్రేమ విజయమా? పబ్లిక్ టేస్ట్ మారిందా? లేక మంచి సినిమా ఎప్పుడూ నమ్మకంగా హిట్టవుతుందనే న్యాయానికి నిలువెత్తు ఉదాహరణా? జవాబు మాత్రం క్లియర్ – సైయారా సినిమా కాదు, బ్లాక్‌బస్టర్ లెజెండ్!

మరింత సమాచారం తెలుసుకోండి: