
తాజా ఇంటర్వ్యూలో రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ తాను రోజా గారిని అమ్మగా భావిస్తానని రోజా మేడం కూడా తనను ఒక కొడుకుల అందరికీ పరిచయం చేస్తూ ఉంటుందని తెలిపారు. తన పెళ్లి కూడా ఆమె చేతుల మీదే జరిగింది నాకు సంబంధించి ఆనందమైన బాధైనా కూడా నేనున్నానంటూ పిలిచే ఏకైక వ్యక్తి రోజా మేడం గారే అంటూ తెలిపారు.. నా అనుకున్న వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అసలు ఊరుకోనని..మనిషి ముందు ఒక మాట వెనుక ఒక మాట ఉండకూడదు అంటూ తెలిపారు రాకింగ్ రాకేష్..
మమ్మల్ని ఆవిడ జీరో గా ఉన్నప్పటి నుంచే చూశారు తినడానికి తిండి లేని సమయం నుంచే చూశారు. అప్పటికే ఆమె ఒక స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కూడా ఆవిడ ముందు స్కిట్ చేయడం చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారని తెలిపారు. సుమారుగా 12 ఏళ్ల జబర్దస్త్ ప్రయాణం.. ఈ ప్రయాణం ఎంతోమందికి ఎన్నో ఇచ్చింది అంటూ జబర్దస్త్ మాకు ఇల్లు కొనిచ్చింది, కారు కొనిచ్చింది, మమ్మల్ని విదేశాలకు తిప్పింది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించిందని తెలిపారు.. రోజా గారికి నేనొక్కడినే అభిమానిని కాదు మా జబర్దస్త్ కుటుంబం అంతా కూడా అలాగే ఉంటుందని తెలిపారు.
ఇక రోజా గారు సహాయం నాకు ఒక్కడికే కాదు తీసుకున్న వారందరికీ తెలుసు.. సహాయమని అడిగితే చాలు అలాగే ఆదుకుంటారని తెలిపారు.. అలాంటి వారి నుంచి లాభం పొంది ఇప్పుడు మళ్ళీ ఆవిడనే అంటున్నారు.. తిరిగి అలాంటి వాళ్లని మేము కూడా అనగలం కానీ అలాంటి వేస్ట్ గల్లకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ తెలిపారు.. ఒకవేళ వాడు మనవాడు అని మనసులో ఉంటే మాత్రం వాడి కాళ్లు పట్టుకొని అయినా ప్రాధేయపడి ఇలా చేయొద్దు అని చెప్పేవాడిని.. వాడికి అదే పని అయిపోయింది కేవలం డబ్బు కోసమే ఇలా చేస్తున్నాడో మరి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా మాట్లాడుతున్నారో తెలియదు అంటూ ఇన్ డైరెక్ట్ గా కిరాక్ ఆర్పికి రాకింగ్ రాకేష్ ఇలా కౌంటర్ వేశారు.