టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతోంది. రెండు పాన్ ఇండియా చిత్రాలలోనే కాకుండా మైసా అనే ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రంలో కూడా నటిస్తోంది . ఇలాంటి సమయంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక పలు ఆసక్తికరమైన విషయాలను మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని కానీ ఎప్పుడూ కూడా తన ధైర్యాన్ని కోల్పోలేదని తెలియజేసింది. తనకి కొంత దయా గుణం కూడా ఎక్కువేని దానివల్ల తనకు ఉపయోగం లేదని తెలిసింది.


కానీ తన చుట్టూ ఉండే వారి పైన తాను ఎప్పుడు ఆ దయా గుణాన్ని చూపిస్తూనే ఉంటానని ఎవరికి కూడా అన్యాయం చేయకూడదని మనసులో కోరుకుంటూ ఉంటానని తెలియజేసింది రష్మిక. ఎదుటివారి పట్ల ఎప్పుడూ కూడా ప్రేమతో ఉండాలని కోరుకుంటానని మనం ఎదగడం కోసం ఎవరిని తొక్కాలనీ చూడొద్దు.. అందరినీ కూడా ఎదగనీయాలి అంటూ తెలిపింది. తన చుట్టూ ఉండే నెగటివిటీ అనేది ఎప్పటికీ ఉంటుంది. దాన్ని మనం దాటుకొని ముందుకు వెళితేనే సక్సెస్ అంటూ తెలిపింది రష్మిక.


అలాగే సోషల్ మీడియాలో కూడా తన పైన ట్రోల్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని తను అసలు పట్టించుకోనని మనం కరెక్ట్ గా ఉంటే.. ఆ దారే మనల్ని  ముందుకు నడిపిస్తుందనే నమ్మకం తనలో ఉందని తెలియజేసింది రష్మిక. ఇక తన దారి ఎప్పుడు కూడా ఒకేలా ఉండదని డిఫరెంట్ గా ప్రయత్నించాలనే కాన్సెప్ట్ తోనే ముందుకు వెళుతుందని తెలిపింది. అందుకే తాను ఈ స్థాయిలో ఉండడానికి ఇదే కారణమని తెలియజేసింది రష్మిక. అలాగే హీరో విజయ్ దేవరకొండ తో కూడా తాను ఒక సినిమాలో నటించేందుకు సిద్ధంగా నే ఉన్నట్లుగా తెలియజేసింది.ఈ ఏడాది ఛావా, కుబేర వంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: